కంచుకట్ల సుభాష్ కు డాక్టరేట్ ప్రదానం..

by Sumithra |
కంచుకట్ల సుభాష్ కు డాక్టరేట్ ప్రదానం..
X

దిశ, మర్రిగూడ : ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ కంచుకట్ల సుభాష్ డాక్టరేట్ ను అందుకున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో భూమి పొరల్లో ఉన్న ఫ్లోరైడ్ నీటిని త్రాగిన నల్గొండ బిడ్డలు ఫ్లోరోసిస్ వ్యాధికి బలైవుతున్నారని సుదీర్ఘకాలం పోరాటం చేసిన సామాజిక కార్యకర్త, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ కంచుకట్ల సుభాష్ కు రెండు దశాబ్దాల తర్వాత డాక్టరేట్ లభించింది. అప్పటి నైజాం ప్రభుత్వం 1945 నల్గొండ జిల్లాలో బట్లపల్లి గ్రామంలో 0.3 పీపీఎం నుండి 28 పీపీఎం వరకు ఫ్లోరైడ్ ఉండడంతో ఆ నీటిని తాగిన నల్గొండ బిడ్డలకు ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుందని గుర్తించారు. ఆ తర్వాత భూగర్భ జలాలను పెంచుటానికి చెరువుల నిర్మాణం చేపట్టారు. అయినా ఫలితం లేకపోయింది . స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ నాగార్జునసాగర్ అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నిర్మాణం చేపట్టి జాతికి అంకితం చేశారు.

ఈ ప్రాజెక్టు కింద కుడి కాలువ, ఎడమ కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 28 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఎడమ కాలువ ద్వారా నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ ప్రాంతం అదేవిధంగా కోదాడ ప్రాంతం ఖమ్మం మీదుగా పాలేరు రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందిస్తున్నారు. ఎగువ ప్రాంతమైన దేవరకొండ, నల్గొండ, భువనగిరి డివిజన్లకు నీరందడం కష్టతరంగా మారింది. ఈ ప్రాంత ప్రజలు వ్యవసాయాన్ని భూగర్భ జలాల ద్వారానే త్రాగు నీరు, సేద్యం చేస్తూ జీవనం సాగిస్తూ ప్రకృతి వైపరీత్యాల కారణంగా కరువు కాటకాలు రావడంతో నల్గొండ జిల్లాలో భూగర్భ జలం రోజురోజుకు అడుగంటి పోతున్నది. మానవ జనాభా పెరిగిన కొద్దీ అంతే స్పీడుగా భూగర్భ నీటిని వాడుకోవడం కూడా పెరిగినది. నల్గొండ జిల్లాలో భూగర్భ జలాల కొరకు అన్వేషించి విపరీతమైన బోర్లు వేయడంతో వేసిన బోర్లన్ని ఎండిపోతూ ఉన్నాయి .

ఫ్లోరైడ్ ప్రాంతాల్లో 28 పీపీఎం..

ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో 250 ఫీట్లనుండి 1150 ఫీట్ల వరకు బోర్లు వేసి భూమిని జల్లెడతుట్ల లాగా చేసేసారు. ఈ విధంగా భూగర్భ జలాల పై ఆధారపడడంతో అదేవిధంగా జనాభా పెరుగుదలతో భూగర్భ నీటి వినియోగము పెరగడంతో ఫ్లోరైడ్ నీటిని త్రాగుతూ సుమారు 25 లక్షల మంది ఫ్లోరోసిస్ వ్యాధి గురైనారు. ఫ్లోరైడ్ నీటిని తాగడం వలన డెంటల్ ఫ్లోరోసిస్, స్కెల్టల్ ఫ్లోరోసిస్, న్యూరాలజికల్ ఫ్లోరోసిస్ కిడ్నీల వ్యాధులు, మనుషులు, జంతులు కూడా ఫ్లోరోసిస్ రక్కసికి బలైనారు. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఉద్యమ సంస్థను 1992లో ప్రారంభించారు.

ఫ్లోరోసిస్ ఉద్యమ సంస్థగా ఏర్పాటు..

ఫ్లోరోసిస్ మహమ్మారిని ఫ్లోరోసిస్ ప్రాంతాల నుండి తరిమి వేసేటందుకు కంచుకట్ల సుభాష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవస్థాపక రాష్ట్ర కన్వీనర్ గా వివరిస్తూ ఉద్యమాలకు శ్రీకారం చుట్టాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమాలతో తీవ్ర ఒత్తిడి చేశారు. దేశ ప్రధాన మంత్రులకు, రాష్ట్ర ముఖ్యమంత్రులకు , గవర్నర్లకు, జాతీయ మానవ హక్కుల చైర్మన్ కు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టుకు పోస్ట్ కార్డు ఉద్యమంతో పాటు హైకోర్టులో సిగ్నేచర్ క్యాంపెయిన్ వాల్ రైటింగ్స్, కళాకారుల ద్వారా ప్రజా చైతన్య కార్యక్రమాలు చేస్తూ ప్రపంచాన్ని ఫ్లోరోసిస్ వైపు మళ్ళించాడు. అలాగే ఇందిరాపార్కు నల్గొండ కలెక్టరేట్ల వద్ద ధర్నాలు గత మూడున్నర దశాబ్దాలుగా అనేక పోరాటాలు చేసి భూపరితల జలాలైన కృష్ణానది జలాలను నల్గొండ జిల్లాలో చిన్న చిన్న ట్యాంకులు ఏర్పాటు చేసి గత ప్రభుత్వాలు త్రాగునీరు అందించారు .తెలంగాణ రాష్ట్రము ఏర్పాటుకు ఉద్యమాలు ఉర్రూతలూగుతుల క్రమంలో నల్గొండ ఫ్లోరోసిస్ సమస్య కూడా రాష్ట్ర ఏర్పాటుకు కీలక భూమిక పోషించింది నాటి ఉద్యమం.

నేటి ముఖ్యమంత్రి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పై పోరాత్ర చేసి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నల్గొండ జిల్లాకు త్రాగునీరు, సాగునీటి కొరకు 200 టీఎంసీల నీళ్లను కేటాయిస్తానని హామీ ఇచ్చి మొదటి సంతకము తెలంగాణ రాష్ట్రా లోని అన్ని గ్రామాలకు త్రాగునీరు అందించుటకు సుమారు 50000 కోట్లతో మిషన్ భగీరథ కార్యక్రమాలు చేపట్టి ఇంటింటికి త్రాగు నీళ్ళు అందిస్తున్నారు . అదేవిధంగా శాశ్వత పరిష్కారం కొరకు డిండి ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించుటకు దేవరకొండ, మునుగోడు నియోజకవర్గం లోని 3,50,000 ఎకరాలకు గొట్టిముప్పుల కిష్టరాయన్ పెళ్లి శివన్నగూడెం ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందించాలని దృఢమైన సంకల్పంతో ప్రాజెక్టులను ప్రారంభించారు.

ఈ సుదీర్ఘ పోరాటాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఫ్లోరోసిస్ సమస్యను శాశ్వత పరిష్కార కొరకు నేను హార్నిశలు ఉద్యమాలు చేసి సాధించిన సందర్భంగా ఆయనను గుర్తించారు. ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఫ్లోరోసిస్ రక్కసి పై పోరాటం చేసి సాధించిన కంచుకట్ల సుభాష్ డాక్టరేట్ అవార్డు నేషనల్ హ్యూమన్ రైట్స్ బోర్డ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ చేతుల మీదుగా తమిళనాడు హోసూర్ లో తీసుకున్నారు. అవార్డును ప్రధానం చేసిన అకాడమీకి కంచుకట్ల సుభాష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహేశ్వరం వెంకటేశ్వర్లు, ఎలిమినేటి సత్తిరెడ్డి, మహేశ్వరం సురేష్, లింగంపల్లి కళ్యాణ్, టెలిజాల శివ తదితరులు అభినందనలు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed