ఇది మనుషులు తినే తిండినా..? పురుగులు..పురుగులు..ప్రతి దాంట్లో ఇదే సమస్య

by Naveena |
ఇది మనుషులు తినే తిండినా..? పురుగులు..పురుగులు..ప్రతి దాంట్లో ఇదే సమస్య
X

దిశ, తుంగతుర్తి: నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలోని గురుకుల బాలుర పాఠశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది. కళాశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్య వైఖరి మూలంగా తామంతా ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థులు ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. అంతేకాదు విచారణ నిమిత్తం వచ్చిన జిల్లా విద్య శాఖ అధికారి అశోక్ కు లిఖితపూర్వక ఫిర్యాదు కూడా చేశారు. చూస్తూ...చూస్తూ ఈ గలీజ్ తిండి తినలేమంటూ మొత్తుకున్నారు. బాలుర గురుకుల పాఠశాల,కళాశాలలో మొత్తంగా 560 మంది విద్యార్థుల సంఖ్య ఉంటే..అందులో 470 విద్యార్థులు హాజరవుతున్నారు. అయితే భోజనాల విషయంలో విద్యార్థులంతా పడరాని పాట్లు పడుతున్నారు. మెనూ సక్రమంగా పాటించకపోవడంతో పాటు..ఉదయం టిఫిన్ కూడా సక్రమంగా ఉండడం లేదని విద్యార్థులంతా పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే వంట చేసే ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం తమకు వచ్చే సరుకులు సక్రమంగా ఉండడం లేదని, వచ్చే సరుకుల్లో పురుగులు వస్తున్నాయని వివరిస్తున్నారు. ఇదే విషయాన్ని పలుమార్లు వార్డెన్ తో పాటు.. ప్రిన్సిపాల్ కు వివరించినా ఫలితం లేదని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ సరఫరా చేసే సరుకులు సక్రమంగా లేకున్నప్పటికీ తామంతా శుభ్రం చేసి వడ్డిస్తున్నామంటూ పేర్కొంటున్నారు.నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలోని గురుకుల బాలుర పాఠశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది.

Advertisement

Next Story