- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట!
దిశ, దేవరకొండ: కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు నాయకుల మధ్య అంతర్గత విభేదాలు ముదిరి టికెట్ కోసం ఎవరికి వారే తీవ్ర లాబీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. టికెట్ ఆశిస్తున్న నాయకుల మధ్య అంతర్గత పోరు వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిస్సాయ స్థితిలో రాష్ట్ర నాయకత్వం పై తమ ఆవేదనను వెల్లిబుచ్చుతున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం (ఎస్టీ) రిజర్వ్ నియోజకవర్గం అయినందున ఈ నియోజకవర్గం పై చాలామంది పట్టు సాధించడానికి తమ తమ అమాత్యులైన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, పావులు కదుపుతున్నారు.
ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, నేనావత్ కిషన్ నాయక్, వడిత్య రమేష్ నాయక్, డాక్టర్ వడిత్య రవి నాయక్, లు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పెద్దలు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆశీస్సులు ఉండగా, నేనావత్ కిషన్ నాయక్ కు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డిలు అండగా ఉన్నారు. అలాగే వడిత్య రమేష్ నాయక్ కు గతంలో పీఆర్‌పీలో పనిచేసిన సంబంధాలతో సినీ నటుడు చిరంజీవి లాబీతో జానారెడ్డితో లాబింగ్ నడిపిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇంకా ఉస్మానియా ఉద్యమకారుడు డాక్టర్ రవి నాయక్ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయంటూ దేవరకొండ టికెట్ విషయంలో తీవ్ర పోటీ ఉండడంతో, తాజా సర్వేల ద్వారా మొదటి జాబితాలో టికెట్ మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ రావాల్సి ఉండగా, వీరందరూ కలిసి అడ్డుకట్ట వేశారని ఊహగానాలు వినిపిస్తున్నాయి.
తెరపైకి ప్రవళిక కిషన్?
దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలనే కోణంలో అధిష్టానం సర్వేలు చేపట్టి మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే లోపు యువజన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 10% టికెట్లు ఇవ్వాలనే రాహుల్ గాంధీ ప్రతిపాదనతో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి వనపర్తి టికెట్ ఆశించగా అప్పటికే సీనియర్ నాయకులు చిన్నారెడ్డి అక్కడ ఉండడంతో ఆ టికెట్ యువజన కాంగ్రెస్ వదులుకోవాల్సి వచ్చింది. అట్టి టికెట్‌ను యువజన కాంగ్రెస్ వదులుకోవడంతో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు క్రమశిక్షణ సంఘం చైర్మన్ అయినటువంటి నేనావత్ ప్రవళిక కిషన్ నాయక్‌కు అయిన దేవరకొండ టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనలు రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు తెరమీదికి తేవడంతో అధిష్టానం ఆలోచనలో పడి దేవరకొండ టికెట్ ఆదివారం నాడు ప్రకటించిన 55 మందిలో దేవరకొండను పెండింగ్లో పెట్టారనే వార్త వినిపిస్తుంది.
ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా టికెట్ల విషయంలో జాప్యం చేయడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తప్పిదం వల్ల సీటును కోల్పోయింది. ఎన్నికలు 15 రోజులు ఉండగా బాలునాయక్ పేరును ప్రకటిస్తే కనీసం ఏడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయడానికి కూడా సమయం సరిపోలేదని వాదన వినిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ప్రకటించి, బీఫారాలు కూడా అందించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ప్రజాక్షేత్రంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గం అభ్యర్థిని త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి వరిస్తుందో అనే ఆశతో కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.