తక్షణమే రూ. 2లక్షల రుణమాఫీని అమలు చేయాలి

by Naresh |
తక్షణమే రూ. 2లక్షల రుణమాఫీని అమలు చేయాలి
X

దిశ, చండూరు: రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం చండూరు మండల కేంద్రంలో సీపీఎం మండల కమిటీ సమావేశం జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వరి ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించాలని, రైతులకు తక్షణమే రుణమాఫీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాలలో రైతులు ఆరుగాలం శ్రమించి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాగు చేసిన పంట పొలాలు తమ కళ్లముందే చేతికొచ్చే సమయంలో ఎండిపోయిన పొలాలను చూసి రైతులు ఆందోళనకు గురవుతున్నారని, తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన అన్నారు. భూగర్భ జలాల నీటి మట్టాలు రోజురోజుకు పడిపోతుండడంతో వాటి ఆధారంగా సాగు చేసిన పంట పొలాలకు తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని, ఈ పరిస్థితుల్లో ఏఎమ్మార్పీ, వరద కాలువల ద్వారా వీలైనన్ని చెరువులను నీటితో నింపితే భూగర్భ జలాలు అందుబాటులోకి వస్తాయని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, సీపీఎం మండల కమిటీ సభ్యులు చిట్టిమల్ల లింగయ్య, కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం, కంచర్ల రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed