- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్రమంగా నిల్వ ఉంచిన నల్లబెల్లం పట్టివేత..
దిశ, మఠంపల్లి : ప్రభుత్వం నిషేధించిన నల్లబెల్లం అక్రమంగా నిల్వచేసిన స్థావరల పై ఎక్సైజ్ పోలీస్ అధికారులు దాడులు చేసి ముగ్గురు వ్యక్తుల పై కేసునమోదు చేసినట్లు హుజూర్‌నగర్ ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి శనివారం విలేకరులకు తెలిపారు. మఠంపల్లి మండలలోని రామచంద్రపురం గ్రామంలో నమ్మదగిన సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఆ గ్రామంలోని అంగోతు రంగా గడ్డివాములో నిల్వఉంచిన 300 కేజీల నల్లబెల్లం అలాగే అంగోతు శివ ఇంటిలో నిలువ ఉంచిన 70కేజీల నల్లబల్లన్ని పట్టుకున్నట్లు తెలిపారు.
వీరికి బెల్లాన్ని సరఫరా చేసిన మంచ్యతండా చెందిన రూపావత్ రంగా నాయక్ గుర్తించామని ఈ నిందితుల ముగ్గురి పై కేసునమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మరోవైపు సూర్యాపేట జిల్లా ట్రాన్స్పోర్ట్ ఫోర్స్ శాఖ వారు మేళ్లచెరువు మండలం వెల్లటూరు కాలనీలో 1950 లీటర్ల నల్లబెల్లం పానకం ధ్వంసం చేసినట్లుగా తెలిపారు. ఈ దాడుల్లో అధికారులు ఎక్సైజ్ ఎస్సై సతీష్ రెడ్డి, ధనుంజయ్, రఫీ, నాగమణి పాల్గొన్నారు.