- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐకేపీ కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి
దిశ, సూర్యాపేట: ఈ యాసంగి పంట వరి ధాన్యం రైతుల చేతికి వచ్చినందున అన్ని జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవన్లో నిర్వహించిన సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గం సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాసంగి వరి సీజన్ ప్రారంభం అవుతున్న సందర్భంగా ప్రభుత్వం వెంటనే అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం మూలంగా రైతులు ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్మాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. దీంతో గిట్టుబాటు ధర లభించక రైతాంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. వర్షాభావంతో ఇప్పటికే సగం వరి పంట ఎండిపోయాయని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయించిన మద్దతు ధరల బ్యానర్ పెట్టాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన బోనస్ కూడా ఈ రబీలో ఇవ్వాలని కోరారు.
జిల్లాలో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. అందుకు కలెక్టర్ వెంటనే ప్రత్యేక సమావేశం నిర్వహించి తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో అద్దె బోర్లా ద్వారా ప్రజలకు తాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఎండిపోయిన వరి పంటకు ప్రతి ఎకరాకు రూ. 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరువులో పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులు ప్రారంభించి 200 రోజులు ఉపాధి పని ఇవ్వాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రోజు కూలి రూ. 600 ఇవ్వాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, తదితరులు పాల్గొన్నారు.