- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద హైడ్రామా
దిశ, నాగార్జున సాగర్ : నాగార్జున సాగర్ ప్రధాన డ్యాంపై సీఆర్పిఎఫ్ భద్రత తొలగించారు. నాగార్జున సాగర్ డ్యాం తిరిగి ఎస్పీఎఫ్ ఆధీనంలోకి వచ్చింది. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో సాగర్ వద్ద జరిగిన ఘటనల దృష్ట్యా రెండు రాష్ట్రాల అధికారులతో జలశక్తి శాఖ సమీక్ష నిర్వహించింది. సాగర్ నిర్వహణపై ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం చెబుతామని అధికారులు తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టులు, అవుట్‌లెట్స్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న అధికారులు, సాంకేతిక పరిమితులపైనా నిర్ణయించాల్సి ఉందన్నారు. ఏ అవుట్‌లెట్స్ ఎవరి పరిధిలో ఉండాలో కూడా తేలాల్సి ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక అంశాలపై ఇద్దరు సీఈవోలు చర్చించి నిర్ణయానికి రావాలని జలశక్తి శాఖ సూచించింది. సాంకేతిక అంశాలపై నివేదిక వచ్చాకే తదుపరి భేటీ ఉంటుందని స్పష్టం చేసింది.
శాసనసభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. బోర్డుకు ఇండెంట్ ఇస్తున్నా తెలంగాణను పదేపదే అడగాల్సి వస్తోందని, 13వ గేటు నుంచి తమ వైపు ఉన్న గేట్లను తామే ఆపరేట్ చేసుకుంటామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని కృష్ణ బోర్డుకు రాసిన లేఖలో ప్రస్తావించింది. అయితే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సాగర్ నిర్వహణ తెలంగాణే చూస్తుందని, కాబట్టి వెంటనే ప్రాజెక్టును అప్పగించాలని తెలంగాణ కేంద్రానికి వరుస లేఖలు రాసింది. కేంద్ర హోంశాఖ సూచించిన విధంగా 2023 నవంబర్ 28కి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగేలా చూడాలని కోరుతోంది. తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ.. ప్రస్తుతం 13వ క్రెస్ట్ నుంచి ఏపీ పరిధిలో మిగతా భాగమంతా తెలంగాణ పరిధిలో ఉన్నది. తమ పరిధిలో ఉన్న ప్రాజెక్టును ఏపీ బలవంతంగా ఆక్రమించిందని తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలతో ఎన్నికల సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి.
ఈ క్రమంలో కేంద్ర బలగాలు రంగ ప్రవేశంతో కాస్త ఉద్రికత్త తగ్గింది. ఆ విషయంలో కేంద్ర హోం శాఖ, జలవనరుల శాఖలు రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, కృష్ణా బోర్డుకు చెందిన ఇద్దరు అధికారులు క్షేత్ర స్థాయి పరీశీలన కూడా చేశారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యాం భద్రత కేఆర్ ఎంబీ అధీనంలో ఉండటంతో సీఆర్ పీఎఫ్ బలగాలతో భద్రత నిఘాలో ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య అవగాహన రావడంతో సీఆర్పీఎఫ్ నుంచి భద్రతపరమైన చర్యలను ఎస్పీఎఫ్ అప్పజెప్పారు.