- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే'
దిశ, నేరేడుచర్ల (మఠంపల్లి): ఇక్కడ పుట్టిన వాడిని కాబట్టే.. ఇక్కడ సమస్యలు తెలుస్తాయని హుజూర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని తన సొంత మండలమైన మఠంపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పటినుండి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినవాడిని కాబట్టి ఇక్కడ ప్రాంత సమస్యలు తనకు తెలుసునని ఎక్కడో పుట్టి పెరిగి ఇక్కడికి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ ప్రాంత సమస్యలు ఎలా తెలుస్తాయని అన్నారు.
గతంలో సామాన్యులు ఎవరైనా ఎమ్మెల్యే దగ్గరకు ఎప్పుడైనా వెళ్ళారా, అన్నా అంటూ కలిసారా.. కనీసం ప్రజలకు కనిపించారా అని అన్నారు. ఎక్కడో ఢిల్లీలో, హైదరాబాద్‌లో ఉండేవారు.. కావాలా నిత్యం ప్రజల మధ్య మీ మధ్య ఉండే సైదన్న కావాలో ఆలోచించి ఓటు వేయాలి. ఈ ప్రాంతంలో గత నాలుగేళ్లుగా ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు. గత ప్రభుత్వాలు గిరిజనులు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. గిరిజనుల అభ్యున్నతి కోసం పాటుపడింది ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం అన్నారు.
గిరిజన గుర్తించి తండాలను గ్రామపంచాయతీలో ఏర్పాటు చేశామని వారికి రాజకీయంగా అవకాశం కల్పించామన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో గిరిజనుల కోసం ఎక్కడ లేని విధంగా బంజారా పవన్‌తో పాటు మఠంపల్లి మండలంలో రైల్వే స్టేషన్‌కు సంత్ సేవాలాల్ పేరును పెట్టామని ఆయన గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా పోడు భూములను నమ్ముకున్న రైతులకు పట్టాలిపిస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులను కేటాయించి అభివృద్ధి చేశామన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓటమి తప్పదని రాజకీయాల నుంచి సన్యాసం తీసుకొని పోయేది ఖాయమన్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిన్నా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి రమణ నాయక్, ఎంపీపీ మూడవత్ పార్వతి కొండ నాయక్, జడ్పీటీసీ బాణావత్ జగన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.