- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హుజూర్ నగర్ లో ‘హుడ్రా’ను ఏర్పాటు చేయాలి
దిశ, హుజూర్ నగర్ : హైదరాబాద్లో ప్రభుత్వ భూములు చెరువులు అక్రమంగా ఆక్రమించి అందులో కట్టడాలను కట్టారని గుర్తించి కూల్చివేసేందుకు హైడ్రా ఏర్పాటు చేశారని, అదే తరహాలో హుజూర్ నగర్ పట్టణంలో కూడా హుడ్రా (హుజూర్ నగర్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఏర్పాటు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు సోమగాని నరేందర్ గౌడ్ , ప్రజా కళాకారుడు బాదే నరసయ్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం హుజూర్ నగర్ పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
హుజూర్ నగర్ మున్సిపాలిటీ లేదా హుజూర్ నగర్ పట్టణ రెవెన్యూ పరిధిలో చెరువులు, కుంటలు, ఎన్ఎస్పీ కాలువ కట్టలు, నాలాలు, ఫుట్ పాత్ లు మున్సిపాలిటీ రోడ్లు ఆక్రమణలకు, కబ్జాలకు గురవుతున్నాయని తెలిపారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన హైడ్రా మాదిరిగా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో హుడ్రా ను ఏర్పాటు చేసి అక్రమార్కుల చెర నుండి వాటికి విముక్తి కలిగించాలని కోరారు. కబ్జాదారులకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ కి విన్నవించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు దార మనోహర్, క్రాంతి, చిన్న రామయ్య జావీద్ తదితరులున్నారు.
- Tags
- Hudra