- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సాగర్‌కు గంటగంటకు పెరుగుతున్న వరద
దిశ, నాగార్జున సాగర్ : ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా పరీవాహక ప్రాంతమంతా జలకళ సంతరించుకుంది. కృష్ణమ్మ పరుగులు పెడుతూ నాగార్జున సాగర్ లో సందడి చేస్తోంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి కిందకు పాలధారలా వస్తున్న కృష్ణానదిని చూసేందుకు జనం పోటెత్తారు. నాగార్జున సాగర్ 18 గేట్ల నుంచి పడుతున్న కృష్ణమ్మ సోయగాలను పర్యాటకులు చూస్తున్నారు. సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి కృష్ణమ్మ పరవళ్లు వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో... నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ప్రస్తుతం 18 గేట్లతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎగువన శ్రీశైలం నుండి నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టు 18 క్రష్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు . శ్రీశైలం జలాశయం నుండి సాగర్ జలాశయానికి 1.78,983 క్యూసెక్కుల వరద వస్తుండగా వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 590 అడుగుల వద్ద నీరు నిల్వవుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 312.0450 టీఎంసీల నిల్వ ఉంది. జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 29,394 క్యూసెక్కులను, కుడి కాల్వ ద్వారా 9160 క్యూసెక్కులను, ఎడమ కాల్వ ద్వారా 8280 క్యూసెక్కులను, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కులను, లో లెవల్ కెనాల్ ద్వారా 600 క్యూసెక్కులను, మొత్తంగా 1.78,983 క్యూసెక్కులను వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు.
- Tags
- Nagarjuna Sagar