గుర్రంపోడు డిప్యూటీ తహసీల్దార్ ను సస్పెన్షన్ చేసిన జిల్లా కలెక్టర్

by Kalyani |
గుర్రంపోడు డిప్యూటీ తహసీల్దార్ ను సస్పెన్షన్ చేసిన జిల్లా కలెక్టర్
X

దిశ, గుర్రంపోడు: గుర్రంపోడు డిప్యూటీ తహసీల్దార్ ఎం.డి ఫరీదుద్దీన్ ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని కొప్పోలు గ్రామంలో కోర్టు వివాదంలో ఉన్న భూమిని అక్రమంగా మరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో బాధిత మహిళా గురువారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ తక్షణమే విచారణ జరిపారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలడంతో బాధ్యుడైన డిప్యూటీ తహసీల్దార్ ఫరీదుద్దీన్ పై సస్పెన్షన్ వేటు పడింది. 2018లో జలగం లలితమ్మ తన పెద్ద కూతురు ఉజ్జిని కవితకు, చిన్న కూతురు ఇనుపాముల నాగమణికి ఒక్కొక్కరికి నాలుగు 4.18 గుంటల భూమిని దేవరకొండ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసింది.

చిన్న కూతురు నాగమణి మ్యుటేషన్ చేయించుకో కపోవడంతో ఆ భూమిని సదరు రైతు లలితమ్మ పేరు మీదనే రికార్డులో ఉంది. ఆ భూమిలో ఎకరం మిస్సింగ్ లో ఉండగా మిగతా 3.18 గుంటల భూమి అప్పట్లో తన తల్లి దగ్గర నుంచి కుమారుడు జలగం చంద్రశేఖర రావు కొనుగోలు చేసినట్లుగా రిజిస్ట్రేషన్ జరిగింది. తాము రిజిస్ట్రేషన్ చేసుకున్న తమ ప్రమేయం లేకుండా ఆ భూమిని రెండోసారి రిజిస్ట్రేషన్ చేయడం పై కవిత కోర్టును ఆశ్రయించగా యథార్థ పరిస్థితిలో ఉంచమని కోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఆ భూమిని గత ఏడాది కళ్లెం మంజుల అనే మహిళ కొనుగోలు చేసినట్లుగా రిజిస్ట్రేషన్ జరిగింది. తిరిగి గురువారం చంద్రశేఖర రావు కుమారుడు జలగం మధుకు రిజిస్ట్రేషన్ జరిగింది. దీంతో బాధిత మహిళ ఉజ్జిని కవిత ఫిర్యాదు మేరకు విచారణ జరిపి సస్పెండ్ చేశారు.

Next Story

Most Viewed