బీసీ బంధు పార్టీలకు అతీతంగా ఇవ్వాలి : Gunduri Narsimha

by Sumithra |   ( Updated:2023-08-20 16:27:40.0  )
బీసీ బంధు పార్టీలకు అతీతంగా ఇవ్వాలి : Gunduri Narsimha
X

దిశ, చండూరు : రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలకు ఇస్తున్న బీసీ బంధు లబ్ధిదారుల ఎంపికలో పక్షపాత ధోరణి అవలంబిస్తుందని కాంగ్రెస్ పార్టీ బీసీసెల్ మున్సిపల్ అధ్యక్షుడు గుండూరి నర్సింహా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో సుమారు 960 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 15 మందిని మాత్రమే ఎంపిక చేశారని, అందులోనూ బీఆర్ఎస్ పార్టీకి చెందినవారిని మాత్రమే ఎంపిక చేయటం ప్రభుత్వ కక్షపూరిత వైఖరికి నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా అర్హులైన అందరికీ పార్టీలకు అతీతంగా బీసీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ మండల పార్టీ అధ్యక్షులు ఎండి రఫీ, పార్టీ మున్సిపల్ అధ్యక్షులు వడ్డేపల్లి భాస్కర్ సాగర్, చండూరు మున్సిపల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇరిగి శంకర్, దేవా, వర్కాల యాదయ్య, ఇరీగి శీను, ఎర్రజెల్ల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story