- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అకాల వర్షం... అన్నదాతకు కన్నీళ్లు...
దిశ, నూతనకల్ : ఆరుగాలం కష్టించి పంటలు పండించిన అన్నదాతలు ఒక్కసారిగా కురిసిన అకాల వర్షానికి పంట దెబ్బ తినడంతో విలవిలలాడుతున్నారు. పంట చేతికి వచ్చిన సమయానికి కురిసిన వర్షం దెబ్బకు రైతన్నలు లబోదిబోమంటున్నారు. నూతనకల్ మండల వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం దెబ్బకి అన్నదాతలు దిక్కుతోచని దయనీయ స్థితిలో పడ్డారు. అకాల వర్షం మండలంలోని రైతులను తీవ్రంగా నష్టపరిచింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షం రైతులను నెట్టేట ముంచింది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయం కోసం తెచ్చిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దవ్వడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇప్పటికే కొంతమంది రైతులు కోతలు కోసి వడ్ల కుప్పలు పోసి కొనుగోలు కేంద్రంలో నిరీక్షిస్తున్నారు. మరి కొంతమంది రైతుల పంట కోతలకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో కురిసిన వర్షాలు రైతులకు తీవ్రనష్టం మిగిల్చాయి. కొన్నిచోట్ల ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. వర్షం వస్తే వరి ధాన్యంపై కప్పేందుకు టార్పాలిన్, ప్లాస్టిక్ కవర్లు కూడా లేకపోవడంతో దాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్నిచోట్ల ఈదురు గాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. దీంతో కరెంటుకు అంతరాయం ఏర్పడి చీకట్లో ఉండే పరిస్థితి ఏర్పడింది.