- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహిళా సంఘం సభ్యుల సంతకాల ఫోర్జరీ.. తరువాత ఏం చేశారంటే..
దిశ, మర్రిగూడ: మహిళా సంఘం సభ్యులందరీ సంతకాలు ఫోర్జరీ చేసి సంఘం తీర్మానం చేసినట్లుగా బ్యాంకు అధికారులతో కుమ్ముక్కై లోను డబ్బులు డ్రా చేసిన వైనం మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని దామెర భీమనపల్లి గ్రామపంచాయతీలో సమభావన అంబేద్కర్ మహిళా సంఘంలో డబ్బులు డ్రా చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘంలో అధ్యక్షురాలిగా మామిడి శకుంతల కొనసాగుతుండగా అందులో 9 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ప్రతి సంఘానికి రూ. 10 లక్షల చొప్పున బ్యాంకు రుణం ఇస్తుందని, తీసుకోవాల్సిందిగా సీసీ ద్వారా సంఘం అధ్యక్షురాలుకు కబురు చేరింది. అధ్యక్షురాలు సంఘం సభ్యులకు లోను తీసుకుందామని సమావేశంలో చెప్పగా అందుకు సగం మంది సభ్యులు నిరాకరించారు.
దీంతో సీసీ అధ్యక్షురాలు కుమ్ముకై సంఘంకు లోను కావాలని అందరి సంతకాలతో ఫోర్జరీ చేసి లోను మంజూరికి దరఖాస్తు చేసుకుంది. రూ. 10 లక్షల రుణం మంజూరు అయింది. సీసీ బ్యాంకు అధికారితో కొమ్ముక్కై ఫోర్జరీ సంతకాల సమావేశం తీర్మానాన్ని సమర్పించి వ్యక్తిగతంగా ప్రతి మహిళా ఖాతాలో జమ చేశారు. ఈ క్రమంలోనే గోవిందు సునీత ఖాతాలో జమ అయిన రూ. లక్ష జనవరి 22న ఆమెకు తెలియకుండానే డ్రా చేశారు. దీంతో బాధితురాలు బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా, బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, సంబంధిత సీసీని కలిసి అడగగా పొరపాటున నీ ఖాతాలో డబ్బులు జమ అయినాయి, మళ్లీ బ్యాంకు అధికారులే రిటర్న్ తీసుకున్నారని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు సునీత ఆరోపించింది. సునీత గ్రామపంచాయతీ సర్పంచ్ సమక్షంలో సంఘం సభ్యులను పిలిచి సమావేశం తీర్మానంలో పెట్టిన సంతకాలు మళ్లీ పెట్టించగా, అందరి సంతకాలు తేడా కనిపించాయని బాధితురాలు సునీత స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
సీసీలతో బ్యాంకు అధికారులు కుమ్మక్కు..
సంఘంకు బ్యాంకు నుంచి లోను మంజూరి అయినప్పుడు ప్రతి మహిళా సంతకం తీసుకుని వారి వ్యక్తిగత ఖాతాలో లోను జమ చేయవలసి ఉంటుంది కానీ, సీసీ బ్యాంకు అధికారులు సంఘం సమావేశం అయి తీర్మానం చేసినట్లుగా కాపీ ఇచ్చి వారి ఇష్టం వచ్చినట్లు సభ్యులను బ్యాంకులోకి రాకుండానే, వారి సంతకాలు తీసుకోకుండానే లోను మంజూరు చేస్తూ వారి ఖాతాలోకి డబ్బులు జమ చేస్తున్నారు. బ్యాంకు అధికారులు వెలుగు సిబ్బందితో కుమ్ముక్కై అవినీతికి పాల్పడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
సంఘం నుంచి తొలగిస్తాం అంటుండ్రు: బాధితురాలు గోవిందు సునీత
నాకు తెలియకుండానే నా ఖాతా నుంచి లక్ష రూపాయలు డ్రా చేసినందుకు అధికారులు అడిగానని, మహిళా సంఘం నుంచి తొలగిస్తామని బెదిరిస్తుండ్రు. సంఘం అధ్యక్షురాలు సీసీ బ్యాంక్ అధికారి, అధికారులు కుమ్ముక్కు అయి నా ఖాతాలో డబ్బులు డ్రా చేశారు. వారిపై ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలి.