నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు లెఫ్ట్‌ ఎర్త్‌ డ్యాం దిగువన మంటలు

by Naresh |
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు లెఫ్ట్‌ ఎర్త్‌ డ్యాం దిగువన మంటలు
X

దిశ, నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు లెఫ్ట్‌ ఎర్త్‌ డ్యాం దిగువన సీపెజ్ లీకేజ్ వాటర్ దగ్గర బుధవారం గడ్డి తగలబడి మంటలు చెలరేగాయి. గతంలో సాగర్‌ డ్యామ్‌కు ఎడమవైపు ఉన్న ప్రదేశంలో ఆహ్లాదం నిమిత్తం రెండున్నర కిలోమీటర్ల మేర రూ. 70లక్షల వ్యయంతో కార్పెట్‌ గడ్డిని ఏర్పాటు చేశారు. నిర్వహణ లేకపోవడం, నీరు కొట్టకపోవడంతో కార్పెట్‌ గడ్డి పూర్తిగా ఎండిపోయింది. వర్షం పడిన సమయంలో పచ్చబడినా, ప్రతిఏటా వేసవిలో ఈ గడ్డి కాలిపోతోంది. బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న ఎన్నెస్పీ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చివరికి అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. డ్యామ్‌ సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఏడాది రెండోసారి గడ్డి తగలబడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.





Advertisement

Next Story

Most Viewed