- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరు దాటితే భయం.. భయం.. వెలగని వీధి దీపాలు
by Nagam Mallesh |
X
దిశ, శాలిగౌరారం : మండల పరిధిలోని గురజాల గ్రామంలో కొన్ని నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదు. దాంతో సాయంత్రం పూట ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.వాన కాలం కావడంతో సాయంత్రం వేళన పాములు, తేళ్లు లాంటి విష పురుగులు బయటికి వస్తున్నాయి. రాత్రి సమయంలో వీధి దీపాలు కూడా వెలగకపోవడంతో ఇండ్ల నుండి బయటకు వెళ్లాలంటే గ్రామ ప్రజలు జంకుతున్నారు. గ్రామ కార్యదర్శికి తమ సమస్యలు చెప్పినప్పటికీ పంచాయతీలో నిధులు లేవని సాకు చెప్తున్నారని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గురజాల గ్రామం లో వీధి లైట్లు వేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Advertisement
Next Story