ఫ్లాష్​.​..ఫ్లాష్​...మాజీ ఎమ్మెల్యే రేపాల కొత్త పార్టీ

by Sridhar Babu |   ( Updated:2023-02-15 13:16:28.0  )
ఫ్లాష్​.​..ఫ్లాష్​...మాజీ ఎమ్మెల్యే రేపాల కొత్త పార్టీ
X

దిశ, మిర్యాలగూడ : మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సకల జనుల రాజ్యాధికార చైతన్య మిత్ర పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ తెలిపారు. బుధవారం మిర్యాలగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ఇప్పుడు రాజకీయ పార్టీగా మారి ప్రజా సంక్షేమం విస్మరించిందన్నారు. కేంద్రం తో సమానంగా పన్నులు వసూలు చేస్తూ ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్ షిప్, నిరుద్యోగభృతి, రుణమాఫీ,

దళితబంధు తదితర పథకాలకు బడ్జెట్ లో సరిపడా నిధులు కేటాయించలేదన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్, సాగు నీరు అందక పొట్ట దశలో ఉన్న వరి పొలాలు ఎండుతున్నాయన్నారు. ప్రజా సమస్యలు తీరే వరకు చొక్కా ధరించనని, ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలే పరిపాలకులు కావాలన్న కాంక్షతో సకల జనుల రాజ్యాధికార చైతన్య మిత్ర పేరుతో పార్టీ ని ఆగస్టు 15న ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్ గౌడ్, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story