- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేయాలి
దిశ, మిర్యాలగూడ : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు, మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని సూచించారు. కనీస మద్దతు ధర కల్పిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మిల్లర్స్ కు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వమని వారికి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీను, కర్నాటి రమేష్, గుడిపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.