రైతులంటే రేవంత్ రెడ్డికి చిన్నచూపు : కిషన్ రెడ్డి

by Naveena |
రైతులంటే రేవంత్ రెడ్డికి చిన్నచూపు : కిషన్ రెడ్డి
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : రాష్ట్రంలోని రైతులంటే సీఎం రేవంత్ రెడ్డికి చాల చిన్న చూపని కేంద్రమంత్రి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు.‌ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం గౌస్ కొండ,రేవణపల్లి గ్రామాల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.‌ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి.. పదకొండు నెలలు అవుతుందని,రైతు డిక్లరేషన్ పేరుతో అనేక రకాల హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. రైతు భరోసా,రైతు రుణమాఫీ, రైతు కౌలు భరోసా,రైతు కూలీ భరోసా అనే హామీలు ఇచ్చి.. అమలు చేయడం మరిచారన్నారు. ధాన్యం మీద రూ.500 బోనస్ మరిచారని,దొడ్డు వడ్లకు ఇవ్వమని, సన్న వడ్లలకు ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆరోపించారు. మార్కెట్ యార్డు లోకి ధాన్యం వచ్చాకా బోనస్ రాదని తెలుపుతున్నారన్నారు. 64 లక్షల రైతులు పంట రుణాలను తీసుకుంటే...17 లక్షల రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని, సీఎం ఎన్నికల ముందు మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ఎవరైనా బ్యాంక్ లో రుణాలు తీసుకుంటే సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా మాఫీ చేస్తామన్నరన్నారురాష్ట్రంలోని రైతులంటే సీఎం రేవంత్ రెడ్డికి చాల చిన్న చూపని కేంద్రమంత్రి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు.‌. మూసీ ప్రక్షాళన లక్ష యాభై కోట్లు ఎప్పుడు వస్తాయో తెలియదన్నారు. మూసీ నదికి ఏమి ఇచ్చారని యాత్ర చేశారని,యాత్ర ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చేయాలని, రెండు నెలలు అవుతున్న పంట ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలానే చేసిందని..సన్న వడ్లు వొద్దు దొడ్డు వడ్లు ముద్దు అన్నాడని యెద్దెవా చేశారు. రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి మూసీ నది ప్రక్షాళన అని యాత్ర చేశాడని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

తెలంగాణకు సంధించి ఏ సమస్య పరిష్కరించారని...మిగతా రాష్ట్రాల ఎన్నికల ప్రచారం కి ముఖ్యమంత్రి వెళ్తున్నాడని ప్రశ్నించారు. ‌అడ్డొస్తే బుల్డోజర్ లతో తొక్కిస్త అని మాట్లాడుతున్నాని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు డబ్బులు ప్రతి పైసా మోడీ కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం ఏటా వరి రైతుల కోసం 90 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని 27 వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టిన తీసుకుంటున్నారు. రెండు నెలలుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం.. ఇందిరమ్మ పాలన,ప్రజా పాలాన అని ఎద్దేవా చేశారని, 65 సం గా. 1300 వున్న వరి ధాన్యం గిట్టు బాటు ధరని, మోడీ వచ్చిన పది సంవత్సరాల లో 2300 చేశాడన్నారు.‌ వరి ధాన్యం కల్లాల్లో ఒక్క అధికారి కూడా లేడని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి దమ్ము ధైర్యం ఉంటే చిత్త శుద్ధి వుంటే తెలంగాణ వున్న ధాన్యం కల్లాల్లోకి రావాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పథకాలు అమలు అవుతున్నాయా అని అడిగారు. హర్యానా లో రైతులు కర్రు కాల్చి వాత పెట్టారని.. కాంగ్రెస్ పార్టీ ను జాడ లేకుండా ఓడగొట్టారన్నారు.‌ అనేక ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసిన..కనీసం ఒక్క కిలో వడ్లు కూడా కొనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed