- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
సద్దుల చెరువు వద్ద సర్వం సిద్ధం
X
దిశ, సూర్యాపేట : ఈనెల 16న (సోమవారం ) సూర్యాపేటలో జరగబోయే వినాయక నిమజ్జనం సందర్భంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కమిషనర్ బోళ్ల శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
చెరువు కట్టపై మూడు భారీ క్రేన్ లు, చెరువు చుట్టూ లైటింగ్ ఏర్పాటుతో పాటు జనరేటర్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో మర పడవలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు సౌండ్ సిస్టం ఏర్పాటు చేశామన్నారు. పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్టు చెప్పారు.
Advertisement
Next Story