- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలి
దిశ, పెన్ పహాడ్ : అర్హత కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూర్యపేట జిల్లా అదనపు (రెవిన్యూ) కలెక్టర్ పి రాంబాబు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని సింగారెడ్డి పాలెం గ్రామంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న..ఓటు హక్కు నమోదు స్పెషల్ క్యాంప్ ను ఆకస్మికంగా పరిశీలించి మాట్లాడారు. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2025 అనుసరించి, ఈ నెల 9,10 రోజుల్లో 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవడానికి బూతు స్థాయి అధికారి (B L O)కు కేటాయించిన పోలింగ్ బూతుల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు. గ్రామంలోని పోలింగ్ బూత్ 137 ,138ను పరిశీలించారు. బూత్ స్థాయి అధికారిని కొత్తగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్న వారి వివరాలను ,ఓటరు జాబితాలో అభ్యంతరాలను, సవరణలను అలాగే పోలింగ్ స్టేషన్ ఓటర్ జాబితా నిర్వహణ గురించి తెలుసుకున్నారు. బి ఎల్ ఓ వద్ద ఉన్న రిజిస్టర్ ను పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి..కొనుగోలు చేసిన ధాన్యం, తరలించిన ధాన్యం వివరాలను రైతుల పేర్లను తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని నిర్వాహకులకు సూచించారు అదేవిధంగా గ్రామంలో నిర్వహిస్తున్న సామాజిక విద్య ఉపాధి రాజకీయ కులగణన సమగ్ర అర్హత కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూర్యపేట జిల్లా అదనపు (రెవిన్యూ) కలెక్టర్ పి రాంబాబు అన్నారు.కుటుంబ సర్వేను పరిశీలించారు. ఈ సర్వేకు ప్రజలంతా సహకరించాలని సూచించారు. అక్కడే ఉండి ఓ కుటుంబం సర్వే వివరాలను అధికారులు అడుగుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి తహసిల్దార్ ధారావత్ లాలు నాయక్, ఎమ్ ఆర్ ఐ రంజిత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అఖిల్, విగ్నేష్, వజ్రమ్మ ,ఐకెపి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు గుణగంటి చంద్రకళ, లలిత ,శైలజ, తదితరులు పాల్గొన్నారు.