- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూతల స్వర్గం.. ఎత్తిపోతల జలపాతం
దిశ, నాగార్జున సాగర్: నాగార్జునసాగర్ నుంచి మాచర్ల మార్గంలో 15 కి.మీ దూరంలో ఉంది 70 అడుగుల ఎత్తైన జలపాతం. కృష్ణానది ఉపనది అయిన నక్కవాగు, చంద్రవంక వాగు, తుమ్మల వాగు కలయికే ఈ సుందర జలపాతం. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు.. పాల నురగల జలపాతాలు.. ఊహించుకుంటనే ఎంత బాగుందో కదా. వర్షాలు పడితే చాలు జలపాతాల అందాలను చూస్తూ ఎంత సమయమైనా అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. ఆ అందాలు ఇప్పుడు ఎక్కడో కాదండోయే మన రాష్ట్రంలోనే దర్శనమిస్తున్నాయి. ఎగువ ప్రాంతాలలో భారీగా కురుస్తున్న వర్షాలకు జలపాతాలు పొంగి పొర్లుతున్నాయి.
గత రాత్రి కురిసిన భారీ వర్షానికి పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతల జలపాతం వరద నీటితో జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షం పడటంతో ఎత్తిపోతలకు వాగులు, అటవీ మార్గాల ద్వారా వరద వచ్చి చేరుతోంది. దీంతో 70 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు ప్రవహిస్తోంది. ఎత్తిపోతల జలపాతం నయాగరా అందాలను తలపిస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఎత్తిపోతలకు నీటి ప్రవాహాం మొదలైంది. మట్టితో కూడిన ఎర్ర నీరు అంత ఎత్తైన కొండల నుంచి కిందకు పడుతుండటంతో పర్యాటకులు ఎత్తిపోతలను చూసేందుకు క్యూ కడుతున్నారు. రెండు నెలలు ఆలస్యంగా వరద నీరు ఎత్తిపోతలకు చేరుకుంది.
అటు సాగర్ ప్రాజెక్ట్, నాగార్జునుడి కొండ, మ్యూజియంను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు ఎత్తిపోతల వద్దకు ఎట్టకేలకు నీరు చేరడంతో రెండు రాష్ట్రాల్లోని పర్యావరణ ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ జలపాతం సుమారు 3 కి.మీ మేర ప్రవహించి చివరకు కృష్ణా నదిలో కలుస్తుంది. పక్కనే ఉన్న కొండపై నుంచి ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఒక వ్యూ పాయింట్ ఏర్పాటు చేసింది. జలపాతంతో ఏర్పడిన చెరువులో మొసళ్ల పెంపకం కేంద్రం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వారిచే నిర్వహించబడుతోంది. అక్కడ మొసళ్లను చాలా దూరం నుంచి చూడవచ్చు.
స్వయంభుగా వెలసిన ఏక ముఖ దత్తాత్రేయుడు, రంగనాథ స్వామి
దత్త శిల ఎత్తిపోతల ప్రధాన ద్వారం నుంచి దత్తాత్రేయ దేవాలయానికి వెళ్లే మెట్ల మార్గంలో పెద్ద పుట్టకు సమీపంలో కుడివైపున ఉంటుంది. దత్తాత్రేయుడు ఆ రాయి మీద కుర్చుని విశ్రాంతి తీసుకునేవాడని అనేక మంది మహర్షులు చెప్పేవారు. ఒక్కోసారి ఈ శిల మీదే దత్తాత్రేయుడు కల్లు తాగుతూ కనిపిస్తాడనే నమ్మకాలు ఉన్నాయి. నడి రాత్రిలో దత్త శిలకు తలను పెట్టి దత్తాత్రేయుడిని ధ్యాన్యం చేస్తే తప్పకుండా దత్తదర్శనం కలుగుతోంది ప్రసిద్ధి. రంగనాయక స్వామి ఆలయం ఎత్తిపోతలలో గల మరొక ప్రధాన ఆలయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాయక స్వామి ఆలయం. ఆ ఆలయం ఇక్ష్వాకుల కాలంలో నిర్మించినదిగా విష్ణుకుండినులు అభివృద్ధి చేసినట్లుగా తెలుస్తోంది. రంగనాయక స్వామి కుడా స్వయంభూవుగానే వెలిశాడని ప్రతీతి. ప్రతీ సంవత్సరం వర్షా కాలంలో మధువంక పొంగి రంగనాయక స్వామి వారి పాదాల వరుకు వస్తుంది.
ఇష్టకామేశ్వరి దేవి ఆలయం
ఇష్టకామేశ్వరి దేవి ఆలయం చోళరాజులు అభివృద్ధి చేసినట్లుగా చెబుతారు. జలపాతం దిగువన రంగనాథ స్వామి, దత్తాత్రేయ స్వామికి అంకితం చేయబడిన రెండు ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలను సందర్శించేందుకు సందర్శకులు కొన్ని మెట్లు దిగి వెళ్లాలి. ప్రకృతి సందర్శనల కోసం కూడా ఒక గొప్ప ప్రదేశం. పర్యాటకులు ఆ సుందర దృశ్యాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. అందుకే ఈ ప్రదేశం యతిం తపోం తలం (ఎత్తిపోతల)గా ప్రసిద్ధి గాంచింది.