సంక్షేమ అభివృద్ధి చూసే బీఆర్ఎస్‌లో చేరికలు

by Naresh |   ( Updated:2023-11-10 17:03:27.0  )
సంక్షేమ అభివృద్ధి చూసే బీఆర్ఎస్‌లో చేరికలు
X

దిశ, గరిడేపల్లి: తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పై దృష్టి పెట్టి ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి సుస్థిర పాలన అందించిందని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందిన సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు , టీడీపీ మాజీ సర్పంచ్ కేశబోయిన కృష్ణయ్య తన అనుచరులతో కలిసి సైదిరెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హుజూర్ నగర్ నియోజక వర్గానికి తాను ఎమ్మెల్యే గా గెలిచిన మూడున్నర ఏళ్లలోనే అభివృద్ది చేసి చూపించానని, కానీ కాంగ్రెస్ పార్టీ 20సంవత్సరాలు అధికారంలో ఉన్న నియోజక వర్గాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచిందని అన్నారు.

హుజూర్ నగర్ నియోజకర్గంలోనీ అన్ని గ్రామాలలో ఒకప్పుడు వర్షం వస్తే ఆ దారి వెంట నడవలేని పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు నిర్మించామని అన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీ కి సంబంధం లేకుండా అన్ని పార్టీల కార్యకర్తలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదలకు అత్యవసరమైన సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో నిరుపేద కుటుంబంలోని యువతులకు ఆర్థిక సహాయం అందించి మేన మామ పాత్ర పోషించారని, దివ్యాంగులకు, వృద్దులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ లు అందించి ప్రతి ఇంటిలో సీఎం పెద్ద కొడుకు పాత్ర పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేశబోయిన కృష్ణయ్య, లింగమ్మ కేశబోయిన ముత్తయ్య, ఉమ, కేశబోయిన రవి, నాగేంద్ర, తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Advertisement

Next Story

Most Viewed