- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా..
దిశ, కోదాడ: కోదాడ వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. కోదాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఎన్నికకు ఎన్నికలు రిటర్నింగ్ అధికారిగా ఆర్డీవో సూర్య నారాయణ వ్యవహరించారు. ఉదయం 11:30 నిమిషాల వరకు ఎంపీటీసీలు ఎవరు రాకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా వైస్ ఎంపీపీ పదవి కోసం ముగ్గురు పోటీ పడుతున్నట్టు సమాచారం. వీరిలో తొగర్రాయి ఎంపీటీసీ లిక్కీ గురవమ్మ, చిమిర్యాల ఎంపీటీసీ కలకొండ సౌజన్య, నల్లబండగూడెం ఎంపీటీసీ ఎర్ర మాల క్రాంతి పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. కోదాడ రూరల్ పరిధిలో ప్రస్తుతం 9 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వీరిలో ముగ్గురు వైస్ ఎంపీపీ పదవి కోసం పోటీ పడుతున్నారు. పదవి తమదంటే తాము అంటూ ఎవరికి వారు అంచనా వేసుకుంటున్నారు. ఎంపీపీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన, వైస్ ఎంపీపీ ఎన్నిక మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంచెం తలనొప్పిగానే మారింది.