- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామన్నపేట ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు కృషి చేస్తాం
దిశ,రామన్నపేట : అభివృద్దిలో ఎంతో వెనుకబడిన పాత రామన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు కృషిచేస్తానని జిల్లా ఇంచార్జ్ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. శనివారం రామన్నపేటలో 3.5కోట్లతో నూతనంగా నిర్మించిన పిఏసిఎస్ భవనాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో.. కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రైతుల ప్రతి సమస్యను తీర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, 22 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసిందని మిగిలిన వారికి డిసెంబర్ 9లోపు పూర్తి చేస్తామని అన్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వడ్ల కొనుగోలు విషయమై రైస్ మిల్లర్లతో శుక్రవారం సిఎం సమక్షంలో సమావేశం జరిగిందని, గత ప్రభుత్వం మిల్లర్లకు బాకీ విషయం మాకు ఎలాంటి సంబంధం లేదని, ప్రస్తుతం సర్ ఛార్జీలు పెంచమని తెలిపారు.
రైతులు పండించే పంటలకు ప్రభుత్వమే 3వేలు కోట్ల రూపాయలతో పంటల బీమా ఏర్పాటు చేయబోతుందని తెలిపారు. రైతాంగాని ఎన్ని కష్టాలు వచ్చిన తీర్చడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు.నేతన్నల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని, త్రిఫ్ట్ ఫండ్ కింద 100 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. చేనేతల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, చేనేత పెండింగ్ నిధులను సత్వరం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రద్దు అయిన అప్కోను పునరుద్దరించి చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. చేనేత సంఘాలలో పేరుకపోయిన చేనేత వస్త్రాలు వెంటనే కొనుగోలు చేయాలని అధికారికి పోన్ ద్వారా ఆదేశించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేంద్రం నుండి వచ్చే వివిధ పథకాలను అమలు చేయకపోవడంతో.. సహకార సంఘాలు కోట్లాది రూపాయలు నష్టపోయాయని అన్నారు. చేనేత ద్వారా రాష్ట్రంలోని ఆడబిడ్డలకు నాణ్యమైన స్త్రీ శక్తి చీరల పంపిణీ చేస్తామని తెలిపారు. స్వంత నిధులతో నూతన హంగులతో పిఏసిలఎస్ భవనం ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని కొనియాడారు. భవనానికి అవసరమైన సీసీ రోడ్డు, గోదాం తదితర సౌకర్యాలను ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ...చేనేత ఆప్కాబ్ ను పునరుద్ధరించి నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వారి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే వేముల వీరేశం మంత్రిని కోరారు. వెనకబడిన రామన్నపేటను అన్నిరంగాలలో అభివృద్దికి నూతన పథకాలను మంజూరు చేయడానికి, ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, డిసిఎంఎస్ ఛైర్మన్ బోళ్ళ వెంకట్ రెడ్డి, డిఏఓ గోపాల్, సిఈఓ ఆర్.శంకర్ రావు, ఎన్.శ్రీధర్, పిఏసిటఎస్ ఛైర్మన్ లు నంద్యాల బిక్షంరెడ్డి, రాఘవరెడ్డి, సిఈఓ జంగారెడ్డి,తఃసీల్దార్ లాల్ బహదూర్, ఎంపిడిఓ భూక్యా యాకూబ్ నాయక్, జినుకల ప్రభాకర్, గంగుల రాజిరెడ్డి, పూస బాలకిషన్, తిమ్మాపురం మహేందర్ రెడ్డి, గుత్తా నర్సిరెడ్డి, గోదాసు శిరీషపృద్వి, మడూరు జ్యోతి, రాపోలు నర్సింహ్మా,జెల్ల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.