- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేరుకే డబుల్ రోడ్డు.. ఏం జరిగిందో చూడండి..
దిశ చింతలపాలెం: పేరుకే డబుల్ రోడ్లు కానీ విపరీతమైన చెట్లు ఉండటంతో.. అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే... గుడిమల్కాపురం, దొండపాడు డబుల్ రోడ్డు ఏర్పడి 10 సంవత్సరాలు అయ్యింది. కానీ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో రోడ్డుకు ఇరువైపులా పిచ్చి చెట్లు మొలవటంతో.. మరమ్మత్తుల విషయంలో ఆర్ అండ్ బి అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో అటుగా పొలాలకు వెళ్లే రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వందల వాహనాలు తిరిగే ఈ రోడ్డులో ఎక్కువగా మూల మలుపులు ఉండటంతో.. రోడ్డు మొత్తాన్ని చెట్లు చుట్టేస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతూ..ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు అని స్థానిక ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి చెట్లను తొలగించి ,వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.