- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
roadS : కంప చెట్లతో మూసుకుపోతున్న డబల్ రోడ్డు
దిశ, మర్రిగూడ: నాంపల్లి నుంచి మర్రిగూడకు ,చండూరు నుంచి మర్రిగూడకు వచ్చే రహదారులు ప్రమాదకరంగా మారాయి. గత 8 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లను మళ్లీ ఎలాంటి మరమ్మత్తులు చేపట్టకపోవడంతో ..డబల్ రోడ్లు సింగల్ రోడ్లుగా మారుతున్నాయి. రోడ్డు చుట్టుప్రక్కల ఉన్న కంప చెట్లు పెరిగి.. చెట్లు,చెదారంతో సింగల్ రోడ్డు గా మారాయి. దీంతో నిత్యం ప్రమాదాలకు రహదారులు నిలయాలుగా మారాయి. మూల మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో..ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్డు ఇరువైపులా ఉన్న రోడ్లు స్థలాన్ని రైతులు ఆక్రమించడం తో.. డబల్ రోడ్లు సింగల్ రోడ్లుగా మారుతున్నాయి. దీంతో అధికారులు స్పదించి రోడ్డును ఆక్రమించుకున్న రైతులపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు తెలుపుతున్నారు.అలాగే మూలమలుపుల వద్ద అధికంగా కంప చెట్లు పెరిగి మూలమలుపులు కనిపించకపోవడం.. సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం తో.. వాహనదారులు ప్రమాద బారిన పడి వారి కుటుంబాలు దీవిన పడుతున్నాయి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పదించి..రహదారుల ఇరువైపుల పెరిగిన చెట్లను తొలగించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.