సెలవులో డాక్టర్లు.. వైద్యం అందక కడుపులోనే పసికందు మృతి..!

by Nagam Mallesh |
సెలవులో డాక్టర్లు.. వైద్యం అందక కడుపులోనే పసికందు మృతి..!
X

దిశ, నల్లగొండ : నల్గొండ జిల్లా ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. హాస్పిటల్ లో విధుల్లో డాక్టర్లు లేక ఓ గర్భిణి నొప్పులు భరిస్తూ నానా అవస్థలు పడింది. చివరకు ఆమెకు ఆపరేషన్ చేసినా.. శిశువు గర్భంలోనే మృతి చెందింది. దాంతో ఆస్పత్రి మళ్లీ అబాసు పాలు అవుతోంది. ఇప్పటికే ఓ మహిళ కుర్చీలోనే డెలివరీ కావడంతో సంచలనం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ వార్త వైరల్ కావడం బాధ్యులపై కలెక్టర్ చర్యలు తీసుకున్న సంఘటన అందరికి తెలిసిందే. ఆ సంఘటన తో నిన్న వైద్యులు అందరూ మాపై చర్యలు తీసుకోవద్దు అని మూకుమ్మడిగా వైద్య సేవలు చేయకుండా సెలవు తీసుకున్నారు. మాపై కలెక్టర్ తీసుకున్న చర్యలు వెన్నక్కి తీసుకుంటే తప్ప విధులకు హాజరు అవ్వమని తెలిపారు. అయితే విధుల్లో నిన్న డాక్టర్లు లేకనే అర్ధరాత్రి సమయంలో డెలివరీ కోసం వచ్చిన మాడ్గులపల్లి మండలం గ్యారకుంట పాలెంకు చెందిన గర్భిణీ చెరుకుపల్లి శ్రీలత నానా అవస్థలు పడింది. చివరకు హాస్పిటల్ నుండి బయట ఆసుపత్రికి వెళ్లాలని చూస్తే అక్కడి డ్యూటీ చేస్తున్న ఒక డాక్టర్ ఆమెతో మాట్లాడి ఆమెని లోపలికి తీసుకెళ్లి పరీక్షలు చేయగా కడుపులో శిశువు హార్ట్ బీట్ తగ్గుతుంది అని వెంటనే సిజేరియన్ చేయగా అప్పటికే శిశువు మృతి చెందినది తెలుస్తుంది.

ఆమెకు చాలా జ్వరం ఉంది పరిస్థితి విషమించింది..

మూర్తి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్

ఆసుపత్రిలో నిన్న మూకుమ్మడిగా వైద్యులు సెలవులు పెట్టి విధులకు హాజరు కానీ విషయం వాస్తవమే. అలాగే అక్కడే ఉన్న డ్యూటీలో ఉన్న డాక్టర్ సదరు గర్భిణీ మహిళ కొంత అనారోగ్యంతో జ్వరంతో బాధపడుతుంది అని గ్రహించి.. వెంటనే పరీక్ష చేయగా శిశువు హార్ట్ పల్స్ రేటు పడిపోతుందని గుర్తించింది. వెంటనే సిజేరియన్ చేయగా పాప అప్పటికే విష జ్వరం కారణంగా మృతి చెందినది. వైద్యులు విధులకు హాజరు కావాలని కోరినా.. ఇంత వరకు హాజరు కాలేదు. ఈ విషయమే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు మూర్తి దిశతో తెలిపారు.

Next Story

Most Viewed