రామస్వామి గట్టు వద్ద గల ఖాళీ స్థలాలు కొనుగోలు చేయొద్దు

by Naresh |
రామస్వామి గట్టు వద్ద గల ఖాళీ స్థలాలు కొనుగోలు చేయొద్దు
X

దిశ, హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ శివారులోని రామస్వామి గట్టు వద్ద గల మంత్రి క్యాంపు కార్యాలయం పక్కన ఖాళీ స్థలాలు కొందరు దళారులు అమాయకులను ఆసరాగా చేసుకొని ప్లాట్లు విక్రయిస్తున్నారని తెలిసిందనీ అలా ప్లాట్లు అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరమని హుజూర్ నగర్ తహశీల్దార్ ఎం . నాగార్జున రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ అనుమతులు లేకుండా ఇండ్లను నిర్మించిన అక్రమ కట్టడాలుగా గుర్తించి కూల్చివేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ నుండి పట్టా పొందిన లబ్ధిదారుల ఖాళీ స్థలాలను అమ్మకాలను జరపవద్దని సూచించారు. ఆ స్థలాలను కొనుగోలు చేసి ప్రజలు మోసపోవద్దు అని అలాంటి వారు ఎవరైనా ఉంటే తమకు తహసీల్దార్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తుందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed