చింతపల్లిలో అస్థవ్యస్థంగా డ్రైనేజీ వ్యవస్థ.. పత్తాలేని అధికారులు..!

by Satheesh |   ( Updated:2024-07-17 04:35:51.0  )
చింతపల్లిలో అస్థవ్యస్థంగా డ్రైనేజీ వ్యవస్థ.. పత్తాలేని అధికారులు..!
X

దిశ, చింతపల్లి: చింతపల్లిలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని గ్రామస్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీసీ కాలనీలో మోడల్ స్కూల్‌కి వెళ్లే మార్గం, చింతపల్లి ఎక్స్ రోడ్డులో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదని.. వర్షాల కారణంగా పాములు, తేళ్లు ఇండ్లలోకే వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో విద్యుత్ దీపాలు వెలగడం లేదని, నీటి సరఫరా సరిగ్గా లేదని, గత మూడు నెలల నుండి గ్రామంలో పారిశుధ్యాన్ని పట్టించుకునే అధికారి లేకుండా పోయాడని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామ సెక్రటరీకి రెండు నెలల నుండి ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని.. గ్రామంలోని యువకులు, విద్యావంతులు ఈ సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లాలి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed