- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్..కదిలిన అధికార యంత్రాంగం
దిశ,సూర్యాపేట టౌన్: అన్నం పెట్టని కొడుకులు వీధిన పడ్డ వృద్ధుడు అనే శీర్షికతో.. దిశ దినపత్రిక లో మంగళవారం వార్త ను ప్రచురితం చేశారు. దీంతో ఈ వార్త కు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ వెంటనే స్పందించారు. ఈ కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సూర్యాపేట జనరల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వృద్ధుడిని జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు పరామర్శించి..వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్డిఓ వేణుమాధవ్ వృద్ధుడి కుటుంబ సభ్యులను, కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. వృద్ధుడికి మెరుగైన వైద్యం అందించి, అతను బాగోగులు మీరే చూసుకోవాలని ఆర్డిఓ తెలియజేశారు. కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి లావాదేవీలు ఉన్న వాటిని సాకుగా చూపించి కన్నతండ్రికి అన్నం పెట్టకపోవడం సరైన పద్ధతి కాదని ముగ్గురు కొడుకులు సమానంగా తండ్రికి భోజనం పెట్టి ..అతని బాగోగులు చూసుకోవాలని తెలిపారు. రోడ్డుపై పడుకున్న వృద్ధుడిని చూసి చలించిపోయి.. వార్త ప్రచురితం చేసిన దిశ దినపత్రికకు, వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ కి, అధికారులకు వృద్ధుడు, స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.