- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
High Court: ముగిసిన వాదనలు.. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం పై హైకోర్టు తీర్పు వాయిదా
దిశ, వెబ్ డెస్క్: 2018 లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన మధ్యంతర ఎన్నికల్లో వేములవాడ(Vemulawada) నుంచి గెలిచిన చెన్నమనేని రమేష్(Chennamaneni Ramesh) పౌరసత్వం(citizenship)పై కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. కాగా ఈ కేసుకు సంబంధించి ఈ రోజు తెలంగాణ హైకోర్టు(High Court)లో విచారణ పూర్తవ్వగా.. తీర్పును వాయిదా వేశారు. కాగా ఈ కేసుకు సంబంధించిన ఈ రోజు జరిగిన విచారణలో.. చెన్నమనేని రమేష్ ఏ పాస్‌పోర్టుపై ట్రావెల్ చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. జర్మనీ పాస్‌పోర్టు(German passport)పై ట్రావెల్ చేస్తున్నారని చెన్నమనేని తరఫున లాయర్ కోర్టుకు తెలిపారు. అనంతరం ఆయనకు ఇండియన్ పాస్‌పోర్ట్ ఉందా అని కోర్టు ప్రశ్నించగా... లేదని న్యాయవాది సమాధానం ఇచ్చారు. దీంతో అన్ని వాదనలను పరిగణనలోకి తీసుకున్నామన్న తెలంగాణ హైకోర్టు.. తీర్పు రేపటికి వాయిదా(Judgment adjourned till tomorrow) వేసినట్లు తెలిపారు.