- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
JPC meeting: వక్ఫ్ జేపీసీ మీటింగ్ లో టీఎంసీ ఎంపీ రచ్చ.. గాజు బాటిల్ విసరడంతో చేతికి గాయాలు
దిశ, డైనమిక్ బ్యూరో: వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశంలో టీఎంసీ ఎంపీ ఓవరాక్షన్ కలకలం రేపింది. ఇవాళ జరిగిన భేటీలో వక్ఫ్ బిల్లుపై రిటైర్డ్ జడ్జిలు, న్యాయవాదుల అభిప్రాయాలను కమిటీ వింటున్నది. ఈ క్రమంలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ్ తో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కంట్రోల్ తప్పిన కల్యాణ్ బెనర్జీ పక్కనే ఉన్న గ్లాస్ వాటర్ బాటిల్ ను తీసుకుని బలంగా టేబుల్ కు విసిరి కొట్టాడు. ఈ ఘటనలో ఆయన చేతికి తీవ్ర గాయం అయింది. ఈ హఠాత్తు పరిణామంతో సమావేశం కాసేపు అయింది. వెంటనే కల్యాన్ బెనర్జీకి ఫస్ట్ ఎయిడ్ చేయించారు. ఆ తర్వాత అతడిని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సమావేశం జరుగుతున్న గతిలోకి తీసుకువెళ్లారు. కాగా కల్యాణ్ సింగ్ చర్యలను జగదాంబికా పాల్ నేతృత్వంలోని జేపీసీ కమిటీ తీవ్రంగా పరిగణించింది. దీంతో జేపీసీ సభ్యత్వం నుంచి కల్యాణ్ బెనర్జీని ఒకరోజు సస్పెండ్ చేశారు. బెనర్జీని సస్పెండ్ చేయాలని కోరుతూ వచ్చిన తీర్మానానికి అనుకూలంగా తొమ్మిది ఓట్లు, వ్యతిరేకంగా ఎనిమిది ఓట్లు వచ్చాయి.