- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MRO office : కబ్జాదారుల బరితెగింపు.. !
దిశ, నడిగూడెం : ఖాళీ జాగా కనిపిస్తే దర్జాగా కబ్జా చేయడం.. ప్రభుత్వ భూమైతే ఎంచక్కా ఆక్రమించుకోవడం కొందరు ఆక్రమణదారులకు పరిపాటిగా మారింది. కేసులు నమోదు చేస్తున్నా ఆక్రమణదారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. మండలంలోని సిరిపురం గ్రామ రెవెన్యూ పరిధిలో గల 311 సర్వే నెంబర్ లో ఐదెకరాల విస్తీర్ణం లో ప్రభుత్వ భూమి కలదు. గతంలో ఈ ప్రాంతంలో గ్రానైట్ క్వారీ నిర్వహించగా.. కొంతకాలానికి లీజు కాలపరిమితి ముగిసింది. ఆ తర్వాత సదరు భూమి పై కొందరు ఆక్రమణదారుల కన్ను పడింది. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యక్తులు భూమిని చదును చేసి పక్కనే గల తమ వ్యవసాయ భూమిలో కలుపుకునే ప్రయత్నం చేశారు. గ్రామస్థుల ద్వారా సమాచారం మేరకు అప్పటి తహశీల్దార్ హేమమాలిని తన సిబ్బందితో కలిసి గత నెల 6న కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పరిశీలించి విచారణ చేపట్టారు. విచారణలో ఆయ ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు నిర్ధారణ జరగడంతో కబ్జాకు పాల్పడిన అదే గ్రామానికి చెందిన మొక్క శ్రీను, మొక్క వీరభద్రం, మొక్క నరసింహారావు లపై కేసు నమోదు చేయించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయించారు.
కేసు నమోదు చేసిన ఆగని ఆక్రమణ..
ప్రభుత్వ భూమిని కబ్జాదారుల పై కేసులు నమోదు చేసినప్పటికీ కేవలం నెలరోజుల గడవక ముందే తిరిగి ఆ భూమిని సాగు చేస్తుండటంతో గ్రామానికి చెందిన సుమారు 30 మంది దళిత కుటుంబాలు ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ శుక్రవారం తహశీల్దారు కార్యాలయం ఎదుట నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకొని భూమి లేని నిరుపేద దళిత కుటుంబాలకు ప్రభుత్వం అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ సరితకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కొత్తపల్లి రమేష్, తిరపయ్య, నరహరి, కాంపాటి పెద్ద రాములు, కొత్తపల్లి నాగేశ్వరావు, కాంపాటి రమేష్, జానమ్మ, లక్ష్మి, వెంకమ్మ పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు.. వసిమళ్ల సరిత (తహశీల్దార్, నడిగూడెం)
ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆక్రమణ దారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేయిస్తాం. ఆక్రమణ గురైన ప్రభుత్వ భూమిని స్వాధీన పరుచుకుని హద్దు రాళ్లను ఏర్పాటు చేస్తాం.