తుంగతుర్తి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల ధర్నా

by Naveena |   ( Updated:2024-10-05 09:55:05.0  )
తుంగతుర్తి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల ధర్నా
X

దిశ, నూతనకల్ : తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రగులుతుంది. ఎమ్మెల్యే మందుల సామేల్ కు వ్యతిరేకంగా..జాజిరెడ్డిగూడెంలో అసమ్మతి వర్గం సమావేశం జరగనుంది. దగాపడ్డ కాంగ్రెస్ సీనియల్లారా కదలి రండి అనే పేరుతో.. కార్యక్రమం చేపట్టారు. డిసిసి ఉపాధ్యక్షుడు యోగానంద చారి అధ్యక్షతన సమావేశం కానుంది. సమాచారం అందుకున్న పోలీసులు జాజిరెడ్డిగూడెం మండలంలో అసమ్మతి నేతలు అయినా మోరపాక సత్యం, బ్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి తో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి నూతనకల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో జాజిరెడ్డిగూడెం అసమ్మతి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నూతనకల్ పోలీస్ స్టేషన్ కు తరలివచ్చి.. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగానంద చారి మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీలో ఉంటూ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులను ప్రతిపక్షాల మాదిరిగా చూడడం బాధ కలిగిస్తోందన్నారు. త్వరలో మంత్రి,ఎంపీలను కలిసి..అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో సమస్యలను వివరిస్తామని తెలిపారు. అనంతరం అరెస్టు చేసిన వారందరినీ పోలీసులు విడుదల చేయడంఇతో.. కాంగ్రెస్ కార్యకర్తలు శాంతించి ధర్నా విరమించారు. అసమ్మతి వర్గం వెనుక ఓ మాజీ మంత్రి ఉన్నట్లు ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్, సత్యం, అని రెడ్డి రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఏర్పుల రమేష్ తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed