ఎండిన పంటల వివరాలు సేకరించి నష్టపరిహారం చెల్లించాలి

by Naresh |   ( Updated:2024-03-12 09:39:10.0  )
ఎండిన పంటల వివరాలు సేకరించి నష్టపరిహారం చెల్లించాలి
X

దిశ, రాజాపేట: వంటలు ఎండిపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింహులు అన్నారు. మంగళవారం రాజాపేట తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగ నరసింహులు మాట్లాడుతూ…. రైతులు పెట్టుబడులు పెట్టి పంటలను సాగు చేశారని తీరా పైరుకు నీరు లేక ఎండి పోవడం వలన తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రతి గ్రామంలో ఎండిన పంటలను అంచనా వేసి ఎకరానికి రూ. 30,000 పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు గ్రామాలను సందర్శించి వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలి, పంట నష్టపరిహారం పై ప్రభుత్వం ప్రకటన చేయాలి, వరి పంటకు ఎకరానికి రూ. 30 వేల నష్టపరిహారం ఇవ్వాలి, వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. పశువులకు పశు గ్రాసం ఉచితంగా అందించాలని తహసీల్దారుకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బబ్బురి పోశెట్టి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్, బాబ్బురి శ్రీనివాస్, కటికల రాంచందర్ ,మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story