- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జలాశయానికి జనసంద్రం.. నాగార్జున సాగర్ వద్ద సందడి..
దిశ.నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ డ్యాంను చూడడానికి రెండు కళ్లు చాలవు అనడంలో అతిశయోక్తి లేదు. గేట్ల ద్వారా కిందకు నీళ్లు విడుస్తుంటే చూసేందుకు మామూలుగా ఉండదు. ప్రస్తుతం 26 గేట్ల నుంచి నీటిని దిగువుకు వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా పరివాహాక ప్రాంతమంతా జలకళతో కళకళలాడుతుంది. బిరా బిరా కృష్ణమ్మ పరుగులు పెడుతు నాగార్జన సాగర్ లో సందడి చేస్తోంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి కిందకు పాలధారలా వస్తున్న కృష్ణానదిని చూసేందుకు జనం పోటెత్తారు. నాగార్జున సాగర్ 26 గేట్ల నుంచి పడుతున్న కృష్ణమ్మ సోయగాలను పర్యాటకులు చూస్తున్నారు. కృష్ణమ్మ స్పిల్ వేలో పాలులా పాకుతోంది. సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి కృష్ణమ్మ జలసమాధిని వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో నాగార్జున సాగర్ నీటి నాణ్యతను సంతరించుకుంది. నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతుండటంతో అధికారులు మొత్తం 26 క్రస్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. 22 క్రస్ట్‌గేట్లను 5 అడుగులు, 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,60,691 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 588 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నిల్వ సామర్థ్యం : 306.10 టీఎంసీలుగా ఉంది.
అందాలను తిలకించేందుకు సందర్శకుల సందడి
నాగార్జునసాగర్ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. గేట్ల నుంచి పాలవలె దూకుతున్న కృష్ణమ్మను చూసి ఆనందిస్తున్నారు. మరోవైపు, సాగర్ సమీపంలోని జలపాతం సందర్శకుల దృష్టిని దోచుకుంటుంది. రోడ్లపై ఎక్కడ చూసినా వాహనాలే దర్శనమిస్తున్నాయి. డ్యామ్ పరిసరాలు పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి. దీంతో సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. సాగర్ అందాలను పర్యాటకులు సెల్ ఫోన్ లో బంధిస్తున్నారు