- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పులిచింతల ప్రాజెక్టు బ్రిడ్జిపై మొసలి కలకలం
దిశ చింతలపాలెం : చింతలపాలెం మండలం పరిధిలోని పులిచింతల ప్రాజెక్టుపై మొసలి ప్రత్యక్షం అయ్యింది. పులిచింతల డ్యాం పైకి వెళ్తున్న జెన్ కో అధికారులకు మొసలి కనిపించడంతో..భయబ్రాంతులకు గురయ్యారు. అటువైపుగా కారులో వచ్చిన ప్రయాణికులు మొసలిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం భారీ మొసలి డ్యాం పైకి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వీడియో చూసి స్పందించిన చింతలపాలెం ఎస్సై సైదిరెడ్డి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అటు వైపు వెళ్లే వాహనదారులు, పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. అంతేకాకుండా గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పులిచింతల డ్యాం కు వరద పోటెత్తడంతో..పులిచింతల ప్రాజెక్టు పరిసరాల్లో భారీగా మొసళ్ళు దర్శనమిస్తున్నాయి. కృష్ణా నదికి దారి తీసే పలు వాగుల్లో మొసళ్ళు వాటి పిల్లలు ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో అధికారులు చొరవ తీసుకొని మొసళ్ళు బహిరంగ ప్రవేశాలకు రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.