- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం
దిశ, దేవరకొండ: ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం మోపిన తప్పుడు కేసుతో ఈరోజును ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా గుర్తించాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొర్ర రాం సింగ్ నాయక్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి పిలుపు మేరకు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సూచన మేరకు యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని బస్టాండ్ వద్ద నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రాం సింగ్ నాయక్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ ఆయన సభ్యత్వాన్ని రద్దుచేసి ఆయన నోరు మూయించాలని చూస్తుందని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జేర్పుల లక్ష్మీ తిరుపతి, నియోజకవర్గం అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమెర్ కాసిం, మైనంపల్లి ఎంపీటీసీ నియోజకవర్గం ఉపాధ్యక్షురాలు కొర్ర గౌతమి రాం సింగ్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిలు కేతావత్ రమేష్ నాయక్, సుజిత్ యాదవ్, వంగూరి వెంకటేశ్వర్లు, పాండు నాయక్, ఎన్ఎస్ఐ రాష్ట్ర కోఆర్డినేటర్ ఖదీర్, ఉపసర్పంచ్ ఏకుల సురేష్, వెంకట్, ఎర్ర నగేష్, సన్నీ, పొట్ట ప్రభు, అండారపు సతీష్, శ్రీకాంత్, సుబ్బు, స్వామి, నాగరాజు, మోయిన్ పాషా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాపా నాయక్, లకృతి నాయక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.