కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం

by Naresh |   ( Updated:2023-11-19 14:32:38.0  )
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం
X

దిశ, నకిరేకల్: డిసెంబర్ 3 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం పార్టీ మారాలని చెప్పిన వ్యక్తులు సొంత లాభం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. 30వ తేదీన జరిగే ఎన్నికల్లో చేయి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. ప్రచారంలో తిట్ల దండకం తప్ప చేసిన అభివృద్ధిపై మాట్లాడటం లేదని చిరుమర్తి లింగయ్య పై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ గారు వెంటనే ఈ ప్రాంత నాయకుడిని ఆసుపత్రిలో చేర్పించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి చేయని నాయకుడికి తగిన గుణపాఠం తప్పదన్నారు.

Advertisement

Next Story

Most Viewed