- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ను గద్దె దించడమే నా లక్ష్యం.. రాజగోపాల్ రెడ్డి
దిశ, చౌటుప్పల్ టౌన్ : తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని ఆందోల్ మైసమ్మ ఆలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ కుటుంబ పాలన పై పోరాడేందుకు పార్టీ మారానని... ఇప్పుడు కూడా అదే కారణంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పారు.
తెలంగాణలో కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్యం నిలబడాలని అన్నారు. కేసీఆర్ ఒక్కరి కోసమో.. ఆయన కుటుంబం కోసమో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయలేదని... బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పాటైందని చెప్పారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను లేకుండా చేసేందుకు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లను తన పార్టీలోకి చేర్చుకుని ఏనాడైతే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడో ఆనాటి నుంచే కేసీఆర్ పై తన పోరాటం మొదలైందని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడేందుకు మునుగోడు ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించుచుకుంటారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.