మద్యపాన నిషేధంపై ఆందోళన

by Naveena |
మద్యపాన నిషేధంపై  ఆందోళన
X

దిశ,ఆత్మ కూర్ ఎస్ :మద్యపానంతో తండాలు ఏడాదికి వందల మంది మృతి చెందుతున్నారని మహిళా సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ఎంతో మంది మద్యం కారణంగా.. అనారోగ్యాల పాలవుతున్నారని,బెల్ట్ షాపులను తొలగించి గ్రామంలో మద్యం సేవించడం మానేయాలంటూ డిమాండ్ చేశారు. బెల్ట్ షాప్ ల వారికి వెంటనే బంద్ చేయాలని శాంతియుతంగా తెలిపారు. గ్రామపంచాయతీ కార్యదర్శికు గత నాలుగు రోజుల క్రితం నోటీసులు ఇచ్చినప్పటికీ బెల్ట్ షాపులు కొనసాగిస్తున్నారని, వెంటనే బెల్ట్ షాపులు బంద్ చేయకపోతే ఉన్నతాధికాలకు ఫిర్యాదు చేయనట్లు తెలిపారు. అధికారుల సైతం వెంటనే గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వహణ మానిపించకపోతే ప్రభుత్వ కార్యాలయం ముందు రోడ్డుపై ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి బస్సు సెంటర్ వద్ద సమావేశం ఏర్పాటుచేసి గ్రామంలో మద్యం అమ్మినట్లయితే జరిమానాలు విదించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అధికారులు బెల్ట్ షాప్ లు బంద్ చేయించకపోతే గ్రామంలో వివాదాలు ,ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఉద్యమానికి మండల జేఏసీ మద్దతు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed