అసంపూర్తిగా రోడ్డు పనులు.. కాలనీ వాసుల రాస్తారోకో

by Sumithra |
అసంపూర్తిగా రోడ్డు పనులు.. కాలనీ వాసుల రాస్తారోకో
X

దిశ, మిర్యాలగూడ : పట్టణంలోని తాళ్లగడ్డ కాలనీ - యాద్గార్ పల్లి గ్రామాల నడుమ అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదివారం తాళ్ల గడ్డ వాసులు రోడ్డెక్కారు. తడకమల్ల - మిర్యాలగూడ రోడ్డు పై బైఠాయించి రాస్తా రోకో చేపట్టారు.

రోడ్డు పనులు ప్రారంభించి మద్యలో ఆపడంవల్ల దుమ్ము, దూళి, కంకర పై వాహనాలు అదుపు తప్పి ప్రమాదాల బారిన పడుతున్నారని ఆరోపించారు. రోడ్డు పనులు పూర్తి చేసే వరకు ఆందోళన విరమించేది లేదంటూ ఆదికారులు నాయకులకు వివరించారు. స్పందించిన వారు రెండు రోజులలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Next Story

Most Viewed