గరిడేపల్లి మండలంలో కలెక్టర్ పర్యటన…పలువురు అధికారులకు షోకాజ్ నోటీసులు

by Kalyani |
గరిడేపల్లి మండలంలో కలెక్టర్ పర్యటన…పలువురు అధికారులకు షోకాజ్ నోటీసులు
X

దిశ, గరిడేపల్లి : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్,ఎంపిడిఓ,గ్రామ ప్రభుత్వ కార్యాలయాలలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జస్ నంద్ లాల్ భూ సంబంధ సమస్యలపై వస్తున్న దరఖాస్తులను, వాటి పరిష్కారాన్ని తహసీల్దార్ కవితని అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి పన్ను వసూళ్ల రికార్డులు సరిగా లేకపోవడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు సరిగా జమచేయలేదని , ప్రత్యేక అధికారి అనుమతి లేకుండా ఖర్చు చేశారని, అంతేకాకుండా వాటికి సంబంధించిన బిల్లులు లేకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపిఓ పర్యవేక్షణ సరిగా లేకపోవడంపై కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ సరోజ కు, ఎంపీఓ షేక్ మౌలాన కు, పంచాయతీ సెక్రటరీ జి.నాగేశ్వర రావుకు, గరిడేపల్లి నుంచి బదిలీపై వెళ్లిన పి. సురేష్ లకు షోకాజు నోటీసు జారీ చేసి విచారణ జరిపించాల్సిందిగా డిపిఓకు ఆదేశించారు. అనంతరం ఎంపిడిఓ కార్యాలయంలో జరుగుతున్న ఓటరు జాబితాలో అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు తదితర అంశాలపై గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహిస్తున్న మండల స్థాయి సమావేశంలో కలెక్టర్ పాల్గొని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ… రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 13న ప్రచురించబడిన ముసాయిదా ఓటరు జాబితా పై అభ్యంతరాలు ఉంటే గ్రామ పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తులు అందజేయాలని అన్నారు. అదేవిధంగా ఈ నెల 28న ఓటరు జాబితాను అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులకు అందజేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ నారాయణరెడ్డి, తహసిల్దారు కవిత, ఎంపీడీవో సరోజ, అధికారులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed