- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగార్జున సాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల మూసివేత..
X
దిశ, నాగార్జున సాగర్: నాగార్జునసాగర్ (nagarjuna sagar) ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టడంతో ఎన్నెస్పీ అధికారులు డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను నిలుపుదల చేశారు. నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో భారీగా రావడంతో ఈ నెల 5న క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ప్రారంభించారు. బుధవారం ఉదయం 2 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగించగా.. ఎగువ నుంచి వరద ఉధృతి తగ్గడంతో క్రస్ట్ గేట్లను క్రమంగా తగ్గిస్తూ బుధవారం 11:40 గంటలకు పూర్తిగా నిలుపుదల చేశారు. వరద ఉధృతిని బట్టి క్రస్ట్ గేట్ల ద్వారా మళ్లీ నీటి విడుదల చేపడుతామని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 588.80 అడుగుల వద్ద ఉన్నది. అదే విధంగా గరిష్ఠ నీటినిల్వ 312.50 టీఎంసీలు కాగా, ఇప్పుడు 305.46 టీఎంసీలులు ఉంది.
Advertisement
Next Story