MLA Nenawat Balunaik : గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే...

by Sumithra |
MLA Nenawat Balunaik : గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే...
X

దిశ, చింతపల్లి (దేవరకొండ) : దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరా సంస్థ, మండల స్థాయి గిడ్డంగి గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర సరుకుల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు అవకాశాలు లేని విధంగా రేషన్ దుకాణాలలో వేలిముద్రలు (ఈపీఓఎస్), కంటి స్కానర్ (ఐరిస్), ద్వారా తమ కోటాను రేషన్ కార్డుదారుడు సరైన తూకంతో పొందే విధంగా ప్రత్యక్షంగా రైతుల నుండి ఐకేపీ, పీఏసీల ద్వారా సగటు మద్దతు ధరలకు వరిని సేకరించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

దేవరకొండ నియోజకవర్గంలోని తెలంగాణ సంక్షేమ హాస్టల్స్, అంగన్వాడి సెంటర్, పాఠశాలలకు, మధ్యహ్న భోజన పథకం ద్వారా సన్న బియ్యం జారీ చేయడం, అర్హులైన కుటుంబాలకి దీపం కనెక్షన్ల కేటాయింపు చేయడం, ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు, తినదగిన నూనెలు, పెట్రోలియం ఉత్పత్తుల వంటి నిత్యావసర వస్తువుల దొంగతనం, నల్ల మార్కెటింగ్, వైవిధ్యాలు మొదలైన వాటిపై ఎప్పటికప్పుడు గోదాంను పర్యవేక్షణ చేస్తూ ఉండాలన్నారు. ధరలు పర్యవేక్షణ, వాటిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలి. అనంతరం గోదాం హమాలీల సమస్యలు అడిగి తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కో ఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, సీపీఐ రాష్ట్ర నాయకులు పల్లా నర్సింహా రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ డాక్టర్ వేణుదర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ అరుణ సురేష్ గౌడ్, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కిన్నెర హరికృష్ణ, డీటీసీఎస్ హన్మంతు శ్రీనివాస్ గౌడ్, డిల్లర్ కొర్ర శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed