బీజేపీలోకి చల్లా శ్రీలత రెడ్డి

by Naresh |   ( Updated:2023-10-17 13:23:02.0  )
బీజేపీలోకి చల్లా శ్రీలత రెడ్డి
X

దిశ, నేరేడుచర్ల: నేరేడుచర్ల పట్టణానికి చెందిన చల్ల శ్రీలత రెడ్డి మంగళవారం హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి, హుజూర్‌నగర్ నియోజకవర్గంకు చెందిన ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ, ఆమెతో పాటు పలు పార్టీలకు చెందిన వారు బీజేపీలో చేరారు.

హుజూర్‌నగర్ బీజేపీ అభ్యర్థిగా శ్రీలత రెడ్డి..

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో హుజూర్‌నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా చల్లా శ్రీలత రెడ్డి కే పార్టీ అధిష్టానం టికెట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం టికెట్ కన్ఫామ్ చేసిన తర్వాతనే ఆమె పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను కూడా ఆమె ఇప్పటికే మొదలుపెట్టినట్టు సమాచారం.

ముందే చెప్పిన దిశ..

నేరేడుచర్ల పట్టణానికి చెందిన చల్లా శ్రీలత రెడ్డి నేరేడుచర్ల మున్సిపాలిటీలో 13వ వార్డు కౌన్సిలరుగా పోటీ చేసి గెలిచి నేరేడుచర్ల మున్సిపాలిటీలో వైస్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. అలాగే నేరేడుచర్ల బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలుగా కూడ పనిచేశారు. గత కొంత కొన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ ఈనెల 4న బీఆర్ఎస్ పార్టీకి ఆమె కౌన్సిలర్ వైస్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే ఆమె సోదరుడు పోరెడ్డి కిషోర్ రెడ్డి బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే ఆమె బీజేపీలో చేరుతుందని దిశ ముందస్తుగానే తెలిపింది.

Advertisement

Next Story