- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర కీలకం
దిశ, మిర్యాలగూడ : తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర కీలకం అని ఎమ్మెల్యేలు అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ తో కలిసి గురువారం ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర గణనీయమన్నారు.
భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం విస్నూరు రామచంద్రారెడ్డి లాంటి దొరలపై తిరుగుబాటు చేసి కొన్ని వందల వేల ఎకరాలను పేదలకు పంచిన ఘనత చాకలి ఐలమ్మదన్నారు. దొరలు, రెడ్ల పై తిరుగుబాటు చేసిన చరిత్ర ఐలమ్మది అన్నారు. అలాంటి వీరవనితకి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వర్ధంతి, జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాల నాయకులు బాసాని గిరి, ఎర్రబెల్లి దుర్గయ్య, సలికలపురం యాదగిరి, తుపాకుల తుకారం, బండిరాజుల యల్లయ్య, భీమరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- MLAs