ఘనంగా జయ పాఠశాల సృష్టి వేడుకలు..

by Disha Web |
ఘనంగా జయ పాఠశాల సృష్టి వేడుకలు..
X

దిశ సూర్యా పేట; జయ ఉన్నత పాఠశాలలో ఆదివారం సైన్స్‌ఫెయిర్‌ను జయ సృష్టి 2023 ఘనంగా నిర్వహించారు. ఈ సైన్స్‌ఫెయిర్‌కి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులతో మమేకం అవుతూ ప్రదర్శనలను చూసి విద్యార్థులను అడిగి తెలుసు కున్నారు. జయ స్కూల్​ విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్‌ఫెయిర్‌ పట్ల విద్యార్థులను, ఉపాధ్యాయులను మేనేజ్‌మెంట్‌ వారిని మంత్రి జగదీష్‌రెడ్డి అభినంధించారు.

రక్త పరీక్షలు నిర్వహించిన మెడికల్‌ క్యాంప్‌ , సంస్కృతి సాంప్రదాయాలను తెలిపె బొమ్మల కొలువు, భయ కంపితులను చేసిన డెవిల్‌ హౌస్‌, హైద్రాలిక్‌ మిషన్స్‌ , పిఎస్‌ఎల్‌విసి-33,37 నమూనాలు , నానోట్యూబ్‌ నమూనా ఎలక్షానిక్‌ హోమ్‌ అప్రయన్స్‌ కంట్రోల్డ్‌ బైరిమోట్‌ మరియు ఫుడ్‌కోర్టు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా ఈ ప్రదర్శనలో మంకీగన్‌ కోతులను ప్రాలదోలడానికి వ్యవసాయదారులకు ఎంతో ఉపయోగంగా ఉండే విదంగా తయారుచేసారు. ఇది చూపురులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు తమ పాఠ్య పుస్తకాలలోని వివిధ అంశాలను ప్రయోగాల రూపంలో వివరించారు.

భౌతిక, రసాయన, సాంఘీక శాస్త్ర మరియు జీవశాస్తాలలోని విషయాలను నిజ జీవిత అనువర్తనాలను తమ ప్రయోగాలతో వివరించారు.జయ సృష్టిని ప్రతి సంవత్సరం నిర్వహించడం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకతను,శాస్త్రీయ నైపుణ్యాన్ని పెంపొందించగలుగుతున్నామని కరస్పాండెంట్‌ జయవేణుగోపాల్‌తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను డైరెక్టర్లు జెల్లాపద్మ , బింగి.జ్యోతి అభినంధించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మపర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, జడ్‌. పి. వైస్‌చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణ గౌడ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పుట్టా కిషోర్‌ మరియు తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed