పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలి

by Naresh |
పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలి
X

దిశ, సూర్యాపేట: పశువుల్లో ప్రభలుతున్న గాలికుంటు వ్యాధి నివారణకు జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి సామూహిక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15 నుంచి ఏప్రిల్ 14 వరకు జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల 85 వేల పద్దెనిమిది పశువులకు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్దవంతంగా నిర్వహించడానికి పశు వైద్య అలాగే పశు సంవర్ధక శాఖ ద్వారా 260 మంది సిబ్బందితో 63 టీముల ద్వారా సకల ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ టీకా కార్యక్రమాన్ని జిల్లా సమస్త పశుపోషకులు సద్వినియోగం చేసుకొని తమ పశువులు ప్రమాదకరమైన ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడలని జిల్లా కలెక్టర్ సూచించారు. నాలుగవ విడతలో చేపడుతున్న ఈ కార్యక్రమం నిర్వహణలో రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకొని పశు వైద్యులకు పశుపోషకులకు కొన్ని సూచనలు అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed